Sai Pallavi : సాయి పల్లవి ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసిందా?

Sai Pallavi

ప్రస్తుతం ఇండస్ట్రీలో గ్లామర్ తో పని లేకుండా యాక్టింగ్ టాలెంట్ తో మాత్రమే ఆకట్టుకునే హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అంటే టక్కుమని సాయి పల్లవి పేరు చెప్పొచ్చు. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ, పక్కింటి అమ్మాయిలాగా కనిపిస్తూ అందరి మనసులను దోచేసుకున్న ఈ బ్యూటీ ఇప్పటిదాకా పలువురు స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి షాక్ ఇచ్చింది. స్టార్స్ కి కాకుండా కేవలం కంటెంట్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె వదులుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. మరి ఇప్పటిదాకా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేసే అమ్మాయి సాయి పల్లవి. ఎంత పెద్ద స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ టెంప్ట్ అవ్వకుండా, అందులో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అన్న విషయానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ బ్యూటీ. లేదంటే సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరిస్తుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం నాగ చైతన్య సరసన “తండేల్” అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఇక సాయి పల్లవి ఇప్పటినుంచి మళ్లీ సినిమాలతో బిజీ కాబోతోంది అని టాక్ నడుస్తోంది. మరి ఈ అమ్మడు రిజెక్ట్ చేసిన బడా స్టార్ సినిమాలేవి అనే విషయంలోకి వెళ్తే… తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించే గోల్డెన్ చాన్స్ వచ్చినా ఆ పాత్రకు స్కోప్ లేదన్న కారణంతో వదిలేసుకుందట.

“లియో” సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవినే సంప్రదించారట. కానీ సాయి పల్లవి నో చెప్పడంతో అది త్రిష దగ్గరకు వెళ్ళింది. ఇక ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ దారుణంగా విమర్శలపాలైంది. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ సరసన “వాలిమై” సినిమాలో ఆఫర్ రాగా, అందులో పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట సాయి పల్లవి. తన పాత్రకు సరైన ప్రాధాన్యత లేదు అన్న కారణంతో ఇద్దరు తమిళ బడా స్టార్లను పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ తెలుగులో ఎవరెవరి సినిమాలను రిజెక్ట్ చేసిందంటే…

- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్” సినిమాలో నటించే అవకాశం ముందుగా సాయి పల్లవి దగ్గరికి వెళ్లిందట. కానీ అందులో ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నాయి అనే కారణంతో రిజెక్ట్ చేసిందట. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ డిజాస్టర్ మూవీ “భోళా శంకర్” సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ మెగా ఫాన్స్ కు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చంద్రముఖి 2 సినిమాలో అవకాశం వచ్చినా పాత్ర నచ్చకపోవడంతో వదిలేసుకుందట సాయి పల్లవి. మొత్తానికి ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడం గమనార్హం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు