Nassar : సినిమాలకు గుడ్ బై ?

విలక్షణ నటుడు నాజర్ అందరికీ సుపరిచితమే. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న నాజర్ ఎన్నో అవార్డులు పొందారు. తమిళ నటుడే అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 1989 లో వచ్చిన ‘కోకిల’ ‘ముద్దుల మేనల్లుడు’ చిత్రాలతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు నాజర్. ఇప్పటి వరకు 150 కి పైగా సినిమాల్లో నటించారు. పాత్ర ఎటువంటిదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి దానికి జీవం పోస్తారు. మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ, అవకాశాల కోసం చిరు వెంట పడలేదు. తన కష్టంతో పైకి రావాలని ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి నాజర్. ఇలా చెప్పుకుంటూ పోతే నాజర్ గురించి ఓ పుస్తకమే రాయొచ్చు.

కాకపోతే ఈ విలక్షణ నటుడు త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెబుతున్నారు అని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. కరోనా లాక్ డౌన్ టైం లో నాజర్ ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు అని సమాచారం. కుటుంబ సభ్యుల నుండి కూడా ఇవే సూచనలు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసి, త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నాడట.
అయితే, దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు