God Father: ఫస్ట్‌ సింగిల్‌ కు ముహుర్తం

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ ఈ మూవీలో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు.

చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. తెలుగులో సల్మాన్ ఖాన్ నటించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఈ ఆగస్టు లో రెండు ట్రీట్ లు ఉంటాయని, ఆ మధ్య సినిమా సంగీత దర్శకుడు తమన్ ఎప్పుడో చెప్పాడు.

ఇక ఆల్రెడీ టీజర్ వచ్చేసింది. మరి అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ సింగిల్ పై కూడా తమన్ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం మొదటి సాంగ్ అతి త్వరలోనే రాబోతుందని, ప్రస్తుతం ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషాల్ తో ఓ సాంగ్ ని స్టార్ట్ చేసినట్టుగా మరో అప్డేట్ ని అందించాడు. మరి ఈ ఫస్ట్ సింగిల్ అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి. నయనతార, సల్మాన్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు