God Father : చిరుతో సాంగ్ షురు

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటేనే డాన్సులకు పెట్టింది పేరు. మెగాస్టార్ గ్రేస్,స్టెప్పులు ఆడియన్స్ ను అమాంతం థియేటర్ కు తీసుకుని వస్తాయి. నటన, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ పక్కన పెడితే కేవలం మెగాస్టార్ డాన్సులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఆ రేంజ్ డాన్స్ లు మిస్ అయ్యాయి అనేది చాలామంది అభిప్రాయం. ఆచార్య సినిమాలో లాహే లాహే పాటలో చిరంజీవి ఆకట్టుకున్న, సినిమా ఇచ్చిన నిరాశ వలన మెగాస్టార్ అభిమానులు దానితో సంతృప్తి పడలేకపోయారు.

రాఘవ లారెన్స్, ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్స్ చిరు కెరియర్ లో గుర్తుండిపోయే డాన్స్ ఐటమ్స్ ను అందించారు. మెగాస్టార్ రీ ఎంట్రీ కి మరోసారి రాఘవ లారెన్స్ వచ్చి ఖైదీ నెంబర్ 150 లో సాంగ్ ను కొరియోగ్రఫి చేసారు. ఇప్పుడు ప్రభుదేవా వంతు వచ్చింది. మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ప్రభుదేవా ఒక పాటకు కొరియోగ్రఫి చేస్తున్నారు.
ఈ క్రేజీ సాంగ్ పై దర్శకుడు మోహన్ రాజా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాన్ని తెరకెక్కించిన లెజెండ్ దర్శకుడు ప్రభుదేవాతో మొదటిసారి వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు దర్శకుడు మోహన్ రాజా. షేర్ చేసిన ఫోటోను చూస్తుంటే సాంగ్ షూట్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇటీవలే రిలీజైన గాడ్ ఫాదర్ టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు