Gauthami: వెబ్ సిరీస్ లకు సెన్సార్ అవసరం

ఒకప్పటి తెలుగు, తమిళ నటి గౌతమి సుప్రసిద్ధ నటిగా అందరికీ పరిచయమే. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించారు.
1988లో గురు శిష్యున్ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది గౌతమి. దయామయుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తన నటనతో, అందంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది గౌతమి. వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోలలో చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ గ్రామంలో జన్మించిన గౌతమి చదువుకుంటున్న సమయంలోనే సిని ఇండస్ట్రీకి పరిచయమైంది. రాజేంద్రప్రసాద్ నటించిన గాంధీనగర్ రెండవ వీధి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 1998లో సందీప్ భాటియాను వివాహం చేసుకొని ఆ తర్వాత ఏడాదికే అతడి నుండి విడాకులు తీసుకుంది.

వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి ఆ వ్యాధిని ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. గౌతమి తాజాగా స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ లో ఓ ముఖ్య పాత్రలో నటించింది. చుట్పా ఫిలిమ్స్ పతాకం పై రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisement -

ఈ వెబ్ సిరీస్ గురించి గౌతమి మాట్లాడుతూ.. దయ్యం లేకపోయినా అలాంటి థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో తాను నటించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుందని.. వెబ్ సిరీస్ లకు కూడా సినిమాల మాదిరిగా సెన్సార్ అవసరమని పేర్కొన్నారు. కానీ ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. గౌతమి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు