Jailer: క్రేజీ అప్డేట్

తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ 169 వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రజినీకాంత్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటుంది.

ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీతో పాటు ఐశ్వర్యారాయ్, కె ఎస్ రవికుమార్, రమ్యకృష్ణ, యోగి బాబు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర నిడివి 15 నిమిషాల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కాక ఈ చిత్రం గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. జైలర్ మూవీ గతంలో వచ్చిన కార్తీ ” ఖైదీ” మూవీని ఫాలో అవుతుందట. ఖైదీ చిత్రం కథ మొత్తం ఒకే రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు జైలర్ మూవీ కథ కూడా ఇలాంటి స్ట్రాటజీతోనే రాబోతుందట.

- Advertisement -

జైలర్ మూవీ స్టోరీ మొత్తం ఓ జైలు నేపథ్యంలో సాగుతుండగా ఎక్కువగా రాత్రి జరుగుతోందని సమాచారం. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇక రజనీకాంత్ కి రోబో సినిమా తర్వాత సరైన హిట్టు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా అయినా తలైవా కి మంచి సక్సెస్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు