Gang Leader: మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” రీ రిలీజ్ కు సన్నాహాలు

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రి రిలీజ్ చేయటం న్యూ ట్రెండ్ గా మారింది. ఈ ట్రెండ్ మహేష్ బాబు సినిమా ”పోకిరి” తో స్టార్ట్ అయింది. అయితే, మొదట్లో స్టార్స్ బర్త్ డే సందర్భంగా వారి కెరీర్ లో బెస్ట్ సినిమాను 4k ప్రింట్ లో రి రిలీజ్ చేసేవారు.

తరువాత ఫ్యాన్స్ కోరిక మేరకు , బర్త్ డే అనే కాకుండా, అప్పుడప్పుడు స్టార్స్ బెస్ట్ సినిమా ని రి రిలీజ్ చేయటం మొదలు పెట్టారు. ఇలా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఖుషి‘,మహేష్ బాబు ‘ఒక్కడు‘ బాక్స్ ఆఫిస్ లో భారీ కల్లెక్షన్స్ తెచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు మెగా స్టార్ సినిమా ఈ రేస్ లోకి రానుంది.

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్ లీడర్”. సినిమాను ఫిబ్రవరి 11న రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..వేగా ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. సంక్రాంతి సినిమాల తర్వాత మంచి డేట్ చూసుకుని ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు,లోగడ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

- Advertisement -

చాలా ఏళ్ల క్రితం వచ్చిన “గ్యాంగ్ లీడర్” సినిమా అప్పట్లో అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని, అందులో చిరంజీవి, విజయశాంతి నటనతో పాటు చక్కటి కథ, కథనాలు, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలు ఆద్యంతం అలరింపజేశాయన్న విషయం తెలిసిందే.. ఇక పాటల సంగతికి వస్తే “పాప రీటా….”,, “పాలబుగ్గ…”, “భద్రాచలం కొండ… “, “వానా.. వానా…”, “వయసు వయసు…”, “పనిసా ససా…” వంటి పాటలు, వాటికి చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ వీనులవిందు చేస్తున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు.

ఇక ఈ బ్లాక్ బస్టర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు