Shivatmika : సింగర్ తో పెళ్లి.. ఫోటోలు వైరల్

శివాత్మిక రాజశేఖర్ పెళ్లి గురించి ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. శివాత్మిక తన ప్రియుడితో లేచిపోయిందని, పెళ్లి చేసుకుందని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ను శివాత్మిక ఖండించినా, అప్పటికే తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా, తాజాగా నెట్టింట్లో శివాత్మిక రాజశేఖర్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో తెలుగు రాపర్ రాహుల్ సిప్లిగంజ్ తో శివాత్మిక పెళ్లి దుస్తుల్లో కనిపించిది.

అంటే.. నిజమైన పెళ్లి కాదులేండి. కృష్ణ వంశి దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ సినిమాలో శివాత్మిక, రాహల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో భాగంగా వీరికి పెళ్లి అయింది. ఈ ఫోటోలను బుల్లితెర యాంకర్, నటి అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, గోవిందుడు అందరి వాడేలే, గులాబీ, మురారి వంటి క్లాసిక్ హిట్స్ అందించిన కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమా ”రంగ మార్తాండ”. 1999 లో ఆవిడే శ్యామల చిత్రం లో ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులని అలరించిన ప్రకాష్ రాజ్- రమ్య కృష్ణ జోడి ఇప్పుడు మళ్లి ‘రంగ మార్తాండ’ సినిమా లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

అభిషేక్ జాకర్, మధు కలిపు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో ఎంతో మంది స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చాల కాలం తర్వాత పద్మ శ్రీ బ్రహ్మాంనందం గారు ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ఆదర్శ్ మరియు అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా అనసూయ భరద్వాజ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా కు సంబందించిన కొన్ని స్టిల్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజా శేఖర్ వివాహం జరుగుతుంది. ఈ ఫోటో లో శివాత్మిక, రాహుల్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, అనసూయ భరద్వాజ్,ఆదర్శ్ ఓ సంతోషకరమైన కుటుంబం లా కనిపిస్తారు.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశి, అంతే కంటే.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు స్టార్ కాస్ట్ ఉండటం, మెగాస్టార్ చింరజీవి షాయరీ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ 10,2023 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి మరి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు