విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్3. 2019 లో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. కాగ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లబ్ దబ్ లబ్ దబ్ డబ్బు.. ఇప్పటికే రిలీజ్ అయింది. తాజా గా ఈ రోజు మరో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఊ అ ఆహా ఆహా… లిరికల్ సాంగ్ ను ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో సందడి చేస్తుంది. ఈ పార్టీ సాంగ్ లో హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ అందాలు ఆరబోస్తూ.. యువతకు పిచ్చేక్కిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టేప్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అలరిస్తుంది. ఈ సాంగ్ తో ఎఫ్3 సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. కాగ ఈ సినిమాను మే 27న ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం తీసుకురానుంది.
Read More: Prabhas: ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...