ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజ‌మౌళి మెగా అనౌన్స్..!

మెగా స్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై క‌నిపించి ముడేళ్లకు పైనే అవుతుంది. సైర న‌ర‌సింహ రెడ్డి పూర్తి అయిన వెంట‌నే మెగా స్టార్ ఆచార్య సినిమాను డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో క‌లిసి ప్ర‌క‌టించారు. ముందుగా ఈ సినిమా చిరు కోస‌మే అనుకున్నారు. కానీ అతిథి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ తీసుకున్నారు. అది కాస్త మెయిన్ రోల్ వ‌ర‌కు వ‌చ్చింది. మెగా స్టార్, మెగా ప‌వ‌ర్ స్టార్ ఒకే సినిమాలో క‌నిపించ‌డంతో ఈ సినిమాపై ఆస‌క్తి పెరిగింది. అయితే ఈ సినిమా ప్ర‌క‌టించిన నాటి నుంచి మూడేళ్ల పాటు మెగా ఫ్యాన్స్.. ఆచార్య ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. అని ఎదురుచూస్తున్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారితో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ఆచార్య సిద్ధం అవుతుంది. దీనికి ముందు ఏప్రిల్ 23న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతుంది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ సెన్సెష‌నల్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న‌తో పాటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చీఫ్ గెస్ట్ లుగా హాజ‌రవుతున్నారట‌. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జ‌క్క‌న్న ఇంట్రెస్టింగ్ అనౌన్స్ చేయ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం.

జ‌క్క‌న్న.. టాలీవుడ్ కు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హిట్స్ ఇచ్చారు. అయితే మెగా స్టార్ చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. గ‌తంలో మ‌గ‌ధీర సినిమాను చిరంజీవి కోసం డిజైన్ చేసినా.. అది చివ‌రికి రామ్ చ‌ర‌ణ్ తో వ‌చ్చింది. ఇప్పుడు రాజ‌మౌళి – చిరంజీవి మొద‌టి సారి క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. దీనిపైనే జ‌క్క‌న్న ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్. అయితే వార్త‌లపై క్లారిటీ రావ‌లంటే.. రేపు సాయంత్రం వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు