హ‌రీష్ శంక‌ర్‌కు చిక్క‌ని గ‌బ్బ‌ర్ సింగ్..!

పాలిటిక్స్ నుంచి వ‌కీల్ సాబ్ తో సినిమాల్లోకి రీ-ఎంట్రి ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. దీని త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ.. దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్.. క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ష‌న్ లో హ‌రి హ‌ర వీర మ‌ల్లు షూటింగ్ లో ఉన్నాడు. ఇప్ప‌టికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వ‌ర‌లోనే గుమ్మ‌డికాయ కొట్టాల‌ని చిత్ర బృందం శ‌ర వేగంగా ప‌ని చేస్తుంది. దీని త‌ర్వాత మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో మ‌ల్టీ స్టార‌ర్ గా తెర‌కెక్కే.. వినోదం సీత‌మ్ రీమేక్ చేయ‌డానికి ఈ వ‌కీల్ సాబ్ ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ట.

త‌మిళంలో హిట్ అందుకున్న వినోదం సీత‌మ్ ను స‌ముద్ర ఖ‌ని డైరెక్షన్ చేస్తున్నారు. దీనికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైలాగ్స్ కూడా రాస్తున్నాడు. కాగ ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాను హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ పూర్తి అయిన వెంట‌నే.. సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. దీని త‌ర్వాత ప‌వ‌న్.. సుధీర్ వ‌ర్మ తో పోలీసోడు రీమేక్ చేయ‌నున్నార‌ట‌. అయితే ప‌వ‌ర్ స్టార్ దీనికి ముందే హ‌రీష్ శంక‌ర్ తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్ వ‌చ్చి నెల‌లు గ‌డుస్తున్నా.. ఇంకా ప‌ట్టాతేక్క‌లేదు. పైగా ప‌వ‌న్ ఇత‌ర డైరెక్ట‌ర్స్ తో వ‌రుస‌గా సినిమాల‌కు హామీ ఇస్తున్నాడు.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ స్టోరీ ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని.. అందుకే ఇత‌ర సినిమాల‌కు ఇస్తున్న టైం.. హ‌రీష్ కు ఇవ్వ‌డం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాగ‌ సినిమాలకు గుడ్ బై చెప్పే స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ అనౌన్స్ చేశాడు. దీంతో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా ప‌ట్టాలేక్క‌డం క‌ష్టమే అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు