కేజీఎఫ్-2 నిర్మాణ సంస్థ‌తో సుధ కొంగ‌ర పాన్ ఇండియా మూవీ..!

కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర.. తెలుగులో ‘ఆంధ్ర అంద‌గాడు’ అనే కామెడీ మూవీతో డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు చెందిన సుధ కొంగ‌ర త‌ర్వాత‌.. చెన్నైలోనే సెటిల్ అయి త‌మిళ సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టారు. ద్రోహి, ఇరుధి సూత్రం అనే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇరుధి సూత్రం సినిమాను హిందీలో సాలా ఖ‌దూస్, తెలుగులో గురు తో తెర‌కెక్కించి మూడు భాషాల్లో క్రేజ్ ను సొంతం చేసుకుంది.

త‌ర్వాత ఓటీటీ బాట ప‌ట్టారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో పుతం పుదు కాళై, సూర‌రై పొట్రు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం చేశారు. దీనిలో సూర‌రై పొట్రు పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. దీని త‌ర్వాత.. నెట్‌ఫ్లిక్స్ లో పావ క‌దైగ‌ల్ అనే వెబ్ సిరీస్ ను తెర‌కెక్కించారు.

ఇప్పుడు తాజా గా సుధ కొంగ‌ర తర్వాతి ప్రాజ‌క్ట్ ను అనౌన్స్ చేశారు. కేజీఎఫ్-2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన హోంబ‌లే ఫిల్మ్స్ తో సుధ కొంగ‌ర సినిమా చేయ‌నున్నారు. కాగ క‌న్న‌డలో ప‌లు సినిమాలు నిర్మించిన హోంబ‌లే ఫిల్మ్స్.. కేజీఎఫ్ సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కావ‌డంతో తో పాన్ ఇండియా సినిమాల‌పైనే దృష్టి పెడుతుంది. అందు కోసం సుధ కొంగ‌రతో చ‌ర్చ‌లు జ‌రిపి ఈ సినిమాను ఫిక్స్ చేశారు.

- Advertisement -

పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కించే ఈ సినిమా నిర్మాణ విష‌యంలో హోంబ‌లే ఫిల్మ్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. కాగ ఈ మూవీలో జై భీమ్ తో సూప‌ర్ హిట్ కొట్టిన సూర్యను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఇది వ‌ర‌కు సూర్య‌తో ‘ఆకాశం నీ హ‌ద్దు రా’ తీసిన డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర.. ఈ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి స్టోరీని రెడీ చేసిందో అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఈ ఉత్కంఠ‌కు తెర‌ప‌డాలంటే.. మ‌రి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు