బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీల‌తో నాని…!

నేచుర‌ల్ స్టార్ నాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ కొట్ట‌డం నాని స్టైల్. నేను లోక‌ల్, నిన్ను కోరి సినిమాల‌తో వ‌రుస హిట్స్ కొట్టాడు. వీటి త‌ర్వాత వీ, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాల‌తో మ‌ళ్లీ ప్లాప్ ల‌ను మూట్ట‌గ‌ట్టుకున్నాడు. శ్యామ్ సింగ‌రాయ్ తో బ్రేక్ అందుకున్న త‌ర్వాత‌ నాని స్పీడ్ పెంచేశాడు. పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకోవ‌డానికి వ‌రుసగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు.

కాగ నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం “అంటే సుంద‌రానికి” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా సినిమాలు చేసిన‌ వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్ చేస్తున్నారు. రోమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. కాగ ఈ సినిమాను తెలుగు తో పాటు త‌మిళం, మ‌ళ‌యాలం భాషాల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళంలో నానికి గుర్తింపు ఉండ‌టంతో.. మ‌ళ‌యాలంలో కొత్త గా మార్కెట్ రానుంది.

‘అంటే సుంద‌రానికి’ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్.. శ్రీ‌కాంత్ ఓద‌ల డైరెక్ష‌న్ లో ద‌స‌రా సినిమా చేస్తున్నాడు. నేను లోకల్ సినిమాలో నానితో న‌టించిన కీర్తి సురేష్.. రెండో సారి జ‌త‌కట్ట‌బోతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌ల అయిన నాని ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాల‌తో పాటు నాని మ‌రో రెండు పాన్ ఇండియా సినిమాల‌ను లైన్ లో పెట్ట‌డానికి రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -

సోలో బ‌తుకే సో బెట‌ర్ ఫేం సుబ్బుతో పాటు ఒక్క క్షణం వంటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా చేసిన వీఐ ఆనంద్ తోనూ నాని స్టోరీకి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం. వీఐ ఆనంద్ తో చేసే మూవీ సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఉంటంద‌ట‌. అయితే ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెర‌కెక్కించాల‌ని నాని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అయితే ఈ సినిమాలు ద‌స‌రా రిలీజ్ త‌ర్వాత షూటింగ్ ప్రారంభం అవుతాయ‌ని తెలుస్తుంది. కాగ టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్నారు. నాని కూడా త‌న సినిమాలు హిట్ చేసి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవాలి చూస్తున్నాడు. ఈ నాని ప్ర‌యోగాలు ఎంత వ‌ర‌కు పాస్ అవుతాయో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు