టాలీవుడ్‌లో స‌ర్కారు వారి పాట న‌యా ట్రెండ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్ తో ఉన్నాడు. త‌ర్వాత మ‌రో సినిమా హిట్ కొట్ట‌డానికి రెడీ అవుతున్నారు. గీత గోవిందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ స‌ర్కారు వారి పాట చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ట‌క్క‌రి దొంగ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో న‌టిస్తుంది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా స‌ర్కారు వారి పాట‌ను ప‌రుశురాం తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన సాంగ్స్, టీజ‌ర్ తో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇదిలా ఉండ‌గా.. టాలీవుడ్ లో స‌ర్కారు వారి పాట కొత్త ట్రెండ్ సృష్టిస్తుంద‌ట‌. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత‌.. ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమాలో ఎక్కువ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సినీ క్రిటిక్స్ జోస్యం చెబుతున్నారు. ఈ జోన‌ర్ సినిమాలు ప్లాప్ అయ్యే అవ‌కాశాలు కాస్త ఎక్కువే ఉన్నా.. ఆడియ‌న్స్ కు స్టోరీ న‌చ్చితే బ్లాక్ బాస్ట‌ర్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. గ‌తంలోనూ ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా జోన‌ర్ లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, శ‌త‌మానం భ‌వ‌తి, గీత గోవిందం సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి.

అలాగే టాలీవుడ్ లో ఒక్క జోన‌ర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఆ జోన‌ర్ లోనే సినిమా వ‌స్తాయి. ఇప్పుడు అదే త‌ర‌హాలో స‌ర్కారు వారి పాట త‌ర్వాత‌.. టాలీవుడ్ లో ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ట్రెండ్ వ‌స్తాయ‌ని క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగ ఒక డైరెక్ట‌ర్ ఈ జోన‌ర్ లో క‌థ ఎంపిక చేయ‌డం క‌త్తీ మీద సాము లాంటింది. స్టోరీ కూర్పులో చిన్న త‌ప్పు జ‌రిగినా… కెరీర్ పైనే మ‌చ్చ పడే ప్ర‌మాదం ఉంటుంది. దీంతో ప‌లువురు డైరెక్ట‌ర్స్ దీనికి దూరంగా ఉన్నా.. మ‌రి కొంద‌రు ఈ ప్ర‌యోగం చేసే అవ‌కాశం ఉంది. కాగ ఈ జోన‌ర్ లో సినిమా చేసి ఎవ‌రోరెవ‌రు హిట్స్ అందుకుంటారో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు