అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఐశ్వర్య రాజేష్. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతుంది. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్‌స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ప్రకారం,
ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా క్యాబ్ డ్రైవింగ్ ని వృత్తిగా మార్చుకుంటుంది జమున. ఒక రైడ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆ రైడ్ ఆమె క్యాబ్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు నేర నేపథ్యం వుండటం, వారి ప్రాణాలకు ముప్పు ఉన్నందున జమున కూడా ప్రమాదంలో పడుతున్నట్టు తెలుస్తుంది. చివరికి ఈ ప్రమాదం నుండి జమున ఎలా బయటపడింది అనేది కథలో మెయిన్ పాయింట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది.
ఐశ్వర్య రాజేష్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే స్టోరీ క్రైమ్ థ్రిల్లర్ గా కొనసాగుతున్నట్టు అర్థమవుతుంది. అలాగే 90 నిమిషాల కార్ రైడ్ సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని ట్రైలర్ తో తెలుస్తుంది.
కాగా, ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతుంది.