Teja : కొడుకు కోసం 30 కోట్లు ?

దర్శకుడు తేజ, కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి 30 లక్షల బడ్జెట్ తో ‘చిత్రం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆ రోజుల్లోనే 10 కోట్ల కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీని తర్వాత ‘ఫ్యామిలీ సర్కస్’ ‘నువ్వు నేను’ ‘జయం’ సినిమాలను కోటిన్నర బడ్జెట్ లోపే తెరకెక్కించారు. అందులో ‘ఫ్యామిలీ సర్కస్’ మినహా మిగిలిన రెండు 10 కోట్ల పైనే వసూళ్లను రాబట్టి హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టాయి. తర్వాత మహేష్ బాబుతో ‘నిజం’ తెరకెక్కించారు. దానికి 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు బడ్జెట్ పెరిగింది.

తేజ తెరకెక్కించిన సినిమాలు అన్నీ మేకింగ్ విషయంలో దెబ్బ తిన్నవి లేవు. తక్కువ బడ్జెట్ లో తీసి, నిర్మాతకు లాభాలు తెప్పించాడు. రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కూడా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కింది.
సినిమా మేకింగ్ లో అంత జాగ్రత్తగా ఉండే తేజ, ప్రస్తుతం తన కొడుకు సినిమా కోసం ఏకంగా 30 కోట్ల బడ్జెట్ ను పెట్టిస్తున్నాడని టాక్. తేజ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని తెలుస్తుంది. ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు