Ritesh Rana: చర్యలు ఊహాతీతం

రోజులు మారుతున్న కొద్ది సినీపరిశ్రమలోను, సినిమా కథల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. రొటీన్ కథలను, రొటీన్ ఫార్ములా సినిమాలను ప్రేక్షకులు నిర్ధక్ష్యంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొత్త తరహా కథలకు, కథనాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన “మత్తు వదలరా” ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రితేష్ రానా టేకింగ్, రైటింగ్ కి సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. అదే దర్శకుడి నుండి రాబోతున్న రెండో చిత్రం “హ్యాపీ బర్త్ డే”. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ చేస్తుంది.
హ్యాపీ బర్త్ డే ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించాడు రితేష్ రానా. ఈ సర్రియల్ కామెడీ ట్రైలర్ ను పరిశీలిస్తే చాలా సెటైరికల్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి.

2 వేల రూపాయలు తరహాలో 20000 రూపాయలు నోటు చూపించి, ఆ నోట్ పై రాకేష్ మాస్టర్ బొమ్మ ఉండటం, పాన్ తెలుగు ఫిల్మ్ అని చెప్తూ టైటిల్ కింద అన్ని భాషల్లోనూ తెలుగు అని రాయడం. మార్కెట్ లో స్కానర్ పై ఉన్న మేటర్, సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ పై టైగర్ షరీఫ్ అని ఉండటం, ఇవన్నీ గమనించవచ్చు.

- Advertisement -

వీటన్నిటి మించి సడన్ గా “హ్యాపీ బర్త్ డే” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో ఆశ చాక్లెట్స్ ప్రెజెంట్స్ అని ఉండటం. పవర్డ్ బై బెంగుళూర్ అయ్యంగారి బేకరీ, శ్రీ కృష్ణ జనరల్ స్టోర్స్ అని ఉండటం చూడొచ్చు.
ఎట్టకేలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడియన్స్ లేరు ఉన్నట్లు ఎడిట్ చేసి ఊహించని సప్రైజ్ ఇచ్చారు. కేవలం సుమను యాంకర్ గా పెట్టి ‘హ్యాపీ బర్త్ డే’ టీంతో కానిచ్చేశారు. ఏది ఏమైనా రితేష్ రానా చేసే ప్రొమోషన్స్ కి ఇంటర్వూస్ ఊహాతీతం అని చెప్పొచ్చు.

హ్యాపీ బర్త్ డే సినిమా జులై 8న రిలీజ్ కానుంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు