Devara : తారక్ కి ఆ హీరోయిన్ అంటే అంతిష్టమా..? అడిగి మరీ సినిమాలో అవకాశం ఇచ్చాడు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభ ఉన్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా తారక్ కి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కానీ అందరికన్నా తారక్ కి నచ్చిన హీరోయిన్ మాత్రం నిత్యామీనన్. ఈ విషయాన్ని తారకే ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అంతేకాదు జనతా గ్యారేజ్ సినిమాలో నిత్యమీనన్ పాత్ర కోసం కొరటాల శివ ఎంతో మంది హీరోయిన్స్ ని సంప్రదించారట. కానీ కేవలం ఎన్టీఆర్ సూచన మేరకు ఆ పాత్రలో నిత్యామీనన్ ని సెలెక్ట్ చేశారట కొరటాల శివ. ఈ విషయం తెలిసి నిత్యామీనన్ కూడా షాక్ అయిందట.

ఎన్టీఆర్, నిత్యామీనన్ తో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారట. అందువల్ల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి మరీ తారక్ సినిమాలో నటించిందట నిత్య. ఆమె నాకు చూస్తుంటే మరో సావిత్రి గారిలా అనిపించిందంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం విశేషం. ఆమెలాగా నాచురల్ యాక్టింగ్ ఎవరూ చేయలేరని.. జనతా గ్యారేజ్ లో ఆమె పాత్ర చిన్నదైనందువల్ల ఛాన్స్ ఉంటే ఆమెతో ఫుల్ లెన్త్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారట జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఈ విషయాన్ని ఆయన భార్య ప్రణతికి కూడా చెప్పారట. అంటే ఎన్టీఆర్ మనసులో నిత్యామీనన్ ఎలాంటి స్థానాన్ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు