DJ Tillu : డీజే టిల్లును వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు వరుస ప్లాఫ్స్

DJ Tillu :  ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. ఎక్కడ చూసినా టిల్లు గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లును స్టార్ హీరో వదులుకున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ డీజే టిల్లును వదులుకున్న హీరో ఎవరు? ఆయన ఎందుకు ఈ మూవీని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అనే వివరాల్లోకి వెళ్తే…

డీజే టిల్లును రిజెక్ట్ చేసిన హీరో…

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమా హిట్ అవుతుందని తెలిసినప్పటికీ రిజెక్ట్ చేస్తారు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక హీరో కోసం అనుకున్న సినిమా మరొకరి దగ్గరికి వెళ్లడం అనేది ఇక్కడ సర్వసాధారణం. తినే నూకలపై పేరు రాసిపెట్టి ఉండాలి అన్నట్టుగా ప్రతి సినిమాపై ఆయా హీరోల పేర్లు రాసి పెట్టి ఉంటేనే అది జరుగుతుంది. అయితే కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ సినిమాలను చేజేతులా వదిలేసుకుని ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది స్టార్స్ కు. ఇప్పుడు డీజే టిల్లు ( DJ Tillu ) విషయంలో కూడా ఓ స్టార్ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంతకీ టిల్లు స్క్వేర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో దగ్గరకి ముందు డీజే టిల్లు స్టోరీ వెళ్ళిందట. అర్జున్ రెడ్డి మూవీతో ఆటిట్యూడ్ హీరోగా, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకే ముందుగా డీజే టిల్లు స్టోరీని వివరించారట. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరూ విజయ్ దేవరకొండకు ఈ స్టోరీ కరెక్ట్ గా సరిపోతుందని, అతన్నే హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారట. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ మూవీని రిజెక్ట్ చేసి వాళ్లకు షాక్ ఇచ్చాడు. అంతకుముందే అర్జున్ రెడ్డి మూవీతో బోల్డ్ కంటెంట్ అటెంప్ట్ చేసిన విజయ్ దేవరకొండ, మళ్లీ అదే టైప్ కంటెంట్ తో మూవీతో వస్తే జనాలకు బోర్ కొట్టే అవకాశం ఉంటుందనే ఫీలింగ్ తో ఈ మూవీని పక్కన పెట్టేసాడట. దీంతో డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ ఫేట్ ను మార్చేసింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో సంచలనం క్రియేట్ చేస్తుండగా, మరో సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి విజయ్ దేవరకొండ చేజార్చుకున్న ఈ మూవీ టిల్లు సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. గత కొంతకాలంగా హిట్ అనే మాటకే దూరమైన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీ స్టార్ పై పాజిటివ్ బజ్ నడుస్తోంది. మరి ఈ మూవీ విజయ్ దేవరకొండకు మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా? అనేది ఏప్రిల్ 5నే తేలనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు