Dhamaka : రిలీజ్ తేదీ అదేనా?

“క్రాక్” సినిమా తరువాత రవితేజకు మళ్ళీ అంతటి సక్సెస్ రాలేదు. భారీ అంచనాలతో గత నెలలో విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ” ధమాకా” సినిమాతో ఎలా అయినా హిట్ అందుకోవాలని రవితేజ అనేక ఆశలు పెట్టుకున్నాడు. రవితేజ అభిమానులు కూడా ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతామని భావిస్తున్నారు. గతంలో త్రినాధరావు నక్కిన చేసిన అన్ని సినిమాలకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా బానే ఉంటుందని రవితేజ అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల మీద అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. పెళ్లి సందడి సినిమాతో కథానాయిక గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఇది రెండవ సినిమా. ఇక ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలియ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ధమాకా రొమాంటిక్ గ్లింప్స్, జింతాక్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ మూవీని అక్టోబర్ 21న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆదిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ ” రావణాసుర”, ” టైగర్ నాగేశ్వరరావు” ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు