Amaran: శివ కార్తికేయన్ కొత్త సినిమా వివాదం… బ్యాన్ చేయాలంటూ డిమాండ్

కోలీవుడ్ స్టార్ హీకో శివ కార్తికేయన్ సినిమాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన టైం ఎలా ఉందో అభిమానులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. రీసెంట్ గా ఈ హీరో నటించిన తమిళ స్కై ఫై మూవీ “అయలాన్” థియేటర్లలో, ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. కానీ తెలుగు వెర్షన్ పలు కారణాలతో ఇంకా రిలీజ్ కాలేదన్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మాతలకు, దీనికి వీఎఫ్ఎక్స్ వర్క్ అందించిన షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ వారికి మధ్య ఫైనాన్షియల్ గొడవలు జరుగుతున్నాయి. అందువల్ల అయలాన్ తెలుగు వెర్షన్ ఇంకా ఓటీటీలోకి కూడా రిలీజ్ అవ్వలేదు. ఇది ఇంకా ముగియక ముందే… శివ కార్తికేయ నటిస్తున్న మరో వివాం వివాదంలో చిక్కుకుంది.

ఇక ఇప్పుడు శివ కార్తికేయన్ కొత్త మూవీ “అమరన్” కూడా వివాదంలో చిక్కుకుంది. తాజాగా రిలీజ్ అయిన “అమరన్” టీజర్ చిచ్చు రాజేసింది. కొంతమంది ఈ సినిమాను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం “అమరన్”. వీరమరణం పొందిన సైనికుడు ముకుందన్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ టీజర్ సినిమాకు ఊహించని చిక్కులు తెచ్చి పెట్టింది. టీజర్ లో కాశ్మీరీలు, ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చే సన్నివేశాలే ఈ వివాదానికి కారణమయ్యాయి. “అమరన్” టీజర్ లో వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయని, ఈ మూవీని ఆపేయాలంటూ తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

హీరో శివ కార్తికేయన్, నిర్మాత కమల్ హాసన్ పై తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అప్పట్లో కమల్ హాసన్ “విశ్వరూపం” సినిమాలో ముస్లింలను తీవ్రవాదులుగా చూపించారని, ఇప్పుడు “అమరన్” సినిమాలో కూడా అలాగే చూపిస్తే రిలీజ్ ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు రోడ్డుపై ఈ ఇద్దరు హీరోల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ వివాదంపై హీరో శివ కార్తికేయన్ గాని, అటు నిర్మాత కమల్ హాసన్ గాని ఇంకా స్పందించలేదు. జస్ట్ “అమరన్” టీజరే ఈ రేంజ్ వివాదాలు తెచ్చి పెడితే, రేపు రిలీజ్ అయ్యాక సినిమా నిర్మాతలకు ఇంకెన్ని తలనొప్పులు తెచ్చి పెడుతుందో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు