Deepika Padukone : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

జీవితంపై విసుగు వచ్చిందని, డిప్రెషన్ లోకి వెళ్లానని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని పలువరు సినీ తారలు అప్పుడప్పుడు చెబుతుంటారు. డిప్రెషన్ వల్ల తాము ఎదుర్కొన్న కష్టాలు చెబుతారు. ఇలాంటి బాలీవుడ్ నుంచే ఎక్కువగా వినిపిస్తాయి. తాజాగా ఓ బాలీవుడ్ నటి తాను డిప్రెషన్ లో ఉన్న రోజులను తలుచుకుంది. బాధను తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. ఆ నటి ఎవరో కాదు.. బాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా ఉంటున్న దీపికా పడుకోణె.

మానసిక ఆరోగ్యం గురించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దీపికా, తన డిప్రెషన్ లో ఉన్న రోజులను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకుంది. ‘హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ కూడా చాలా బాగుండేది. కానీ నాకు ఎందుకో బాధగా ఉండేది. దానికి కారణం తెలియదు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి నిద్రపోవాలనుకునేదాన్ని కానీ అది కూడా జరగకపోయేది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ, మా అమ్మ ఈ డిప్రెషన్ నుంచి బయటపడటానికి సాయం చేసింది. బాధ ఎందుకు.. కెరీర్ గురించా.. బాయ్ ఫ్రెండ్ గురించా అని మా అమ్మ నన్ను ప్రశ్నించినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను. ఎందుకంటే, నా బాధకు ఇవేవీ కారణం కాదు. అయినా మా అమ్మ నన్ను అర్థం చేసుకుని, డిప్రెషన్ నుంచి బయట పడేలా చేసింది. అప్పుడు ఆ దేవుడే మా అమ్మను నా వద్దకు పంపించాడు అనుకున్నా’ అంటూ దీపికా పదుకొనే తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంది.

కాగా, దీపికా పదుకొన్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే, ”లైవ్ లవ్ లాఫ్” అనే ఫౌండేషన్ ను స్థాపించింది. ఈ ఫౌండేషన్ ఒత్తిడితో బాధపడేవారి కోసం పని చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు