Samantha : టార్గెట్ మాలీవుడ్

టాలీవుడ్ క్వీన్ సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈ స్పీడ్ ను మరింత పెంచింది. ఒక తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ సొంత ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సామ్, బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సమంతతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే మూడు హిందీ సినిమాలకు సమంత సైన్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే సంవత్సరం బాలీవుడ్ తో పాటు మరో ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వాలని సామ్ భావిస్తుందట. ఆ ఇండస్ట్రీ ఏదంటే మలయాళ ఇండస్ట్రీ. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న కింగ్ ఆఫ్ కోత అనే సినిమాకు సామ్ ఎంపిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు సమంతకు చిత్ర బృందానికి ఇప్పటికే జరిగాయని, త్వరలోనే సామ్ కింగ్ ఆఫ్ కోత టీంతో కలవనుందని తెలుస్తుంది.

తెలుగులో ఇటీవల విడుదల సీతారామంతో మంచి టాక్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మలయాళంలో కింగ్ ఆఫ్ కోత సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు చేస్తుంది. శాకుంతలం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే యశోద షూటింగ్ దాదాపుగా పూర్తి అయంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు