Vijay : జవాన్ కు తోడుగా దళపతి

ప్రస్తుత కాలంలో కామియో రోల్స్ కు ఫుల్ డిమాండ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాల్లో ప్రధాన హీరోతో పాటు మరో హీరోను అతిథి పాత్రలో కనిపించేలా చేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో సూర్య కామియో రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూర్తి పాత్రల్లో కమల్ హాసన్, ఫహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి కనిపించారు. కానీ, చివరగా ఐదు నిమిషాలు కనిపించి, మంచి మార్కులు కొట్టేశాడు సూర్య. అంతే కాకుండా, సినిమాపై హైప్ వచ్చేలా చేశాడు.

విక్రమ్ సినిమా తర్వాత కామియో రోల్స్ ఉండాలని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. హీరోలు కూడా కామియో రోల్స్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమిళ దళపతి విజయ్ కూడా కామియో రోల్స్ చేయడానికి రెడీ గా ఉన్నాట్టు తెలుస్తుంది.

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి జవాన్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడని ఇప్పటికే ఒక వార్త వచ్చింది. తాజా గా మరో వార్త వినిపిస్తోంది.

- Advertisement -

ఈ సినిమాలో తమిళ దళపతి విజయ్ కామియో రోల్ చేయబోతున్నాడట. ఎలాంటి పాత్ర అనేది తెలియదు. కానీ, విజయ్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని టాక్.

కోలీవుడ్ కు చెందిన అట్లీ, ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. కాబట్టి, ఈ సినిమాలో తమిళ హీరోలను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. విజయ్ దళపతిని తీసుకోవడానికి కారణం అదే అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు