Nagachaitanya: చైతూని దగ్గుబాటి ఫ్యామిలీ దూరం పెట్టిందా.?

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే కచ్చితంగా సులభంగా ఎదగవచ్చు అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి.. హీరోగా పరిచయం అవ్వడానికి మాత్రమే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పనిచేస్తుందే తప్ప హీరోగా నిలబడడానికి మాత్రం కాదు.. ఎందుకంటే ఇప్పటివరకు అలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలను మనం చూసాం.. వాళ్లలో ప్రతిభ ఉన్న వారు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడ్డారు.. మిగిలిన వాళ్లంతా కూడా ఫేడ్ అవుట్ అయిపోయారు.. ఈ క్రమంలోనే ఇక్కడ టాలెంట్ మాత్రమే మాట్లాడుతుందనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ వస్తోంది..

ఇదిలా ఉండగా అక్కినేని వారసుడు నాగచైతన్యకి అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇటు రామానాయుడు ఫ్యామిలీ నుంచి కూడా భారీ సపోర్టు ఉంది. ఆ సపోర్ట్ తోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట జోష్ మూవీ తో తెరంగేట్రం చేసిన నాగచైతన్య.. ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక తర్వాత ఏమాయ చేసావే సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు లవర్ బాయ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న ఈయన కొన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు కానీ భారీ సక్సెస్ అయితే ఈయన ఖాతాలో పడలేదని చెప్పాలి . రెండు పెద్ద ఫ్యామిలీల సపోర్టు ఉన్నప్పటికీ కూడా స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నారు నాగచైతన్య..

ఇకపోతే ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబం నాగచైతన్యను దూరం పెడుతోంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి మూవీ మొఘల్ ప్రముఖ నిర్మాత రామానాయుడు వారసురాలు లక్ష్మీ కొడుకే నాగచైతన్య.. వెంకటేష్ కి, సురేష్ బాబు కి మేనల్లుడు కూడా.. అయినప్పటికీ వీళ్లు నాగచైతన్య కెరియర్ ని గాడి లో పెట్టడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు.. ఈ క్రమంలోనే సినీ విమర్శకులు సైతం అటు వెంకటేష్ ని ఇటు సురేష్ బాబుని విమర్శిస్తున్నారు.

- Advertisement -

ఇక నాగచైతన్య కెరియర్ మొత్తాన్ని నాగార్జుననే చూసుకుంటున్నారు. అయినా కూడా సక్సెస్ మాత్రం పొందలేకపోతున్నారు.. దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ కంటే ప్రతిభ ఉన్నవాళ్లే ఇక్కడ తమను తాము ప్రూవ్ చేసుకోగలుగుతారు అనేది వాస్తవం అని చెప్పడంలో సందేహం లేదు.. మొత్తానికైతే దగ్గుబాటి ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు కాబట్టి కనీసం తన సొంత టాలెంట్ తో నైనా నాగచైతన్య స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇప్పుడు తండేల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగచైతన్య.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు