Srikanth Iyengar: అందుకే నా భార్యలు నన్ను వదిలేశారు.. నిజాలు బయటపెట్టిన నటుడు..!

ఈమధ్య కాలంలో అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే తెరకెక్కుతున్న నేపథ్యంలో అందులో నటించే నటీనటులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఏదైనా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరిని ఆకర్షించేలా నటించి.. అందరి మన్ననలు పొందినట్లయితే కచ్చితంగా వారి స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు.. ఈ క్రమంలోనే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి అవకాశాలను అందుకుంటున్నారు.. ఇక అందులో భాగంగానే అటు హీరో హీరోయిన్లతో పాటు ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను కూడా మీడియా వారు ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు.. ఆ ఇంటర్వ్యూలలో వారు తమకు సంబంధించిన పూర్తి వివరాలను అలాగే వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు..

ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. తాజాగా ఈయన తన వ్యక్తిగత విషయాలను అలాగే సినిమా విషయాలను మీడియాతో పంచుకున్నారు.. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ వైజాగ్ వెళ్ళిన విషయం తెలిసిందే.. అక్కడ ప్రాంతీయ మద్యపానాన్ని సేవిస్తూ ఒక వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.. అంతే కాదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా దీనిపై స్పందించారు.. ఈ వీడియో చేసిన తర్వాత శ్రీకాంత్ కి బెదిరింపులు కూడా వచ్చాయట..

ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ ఈ విషయాల గురించి కూడా చర్చించారు.. శ్రీకాంత్ మాట్లాడుతూ.. నేను కామెడీ కోసం చేసిన వీడియోని చాలా సీరియస్ గా తీసుకొని.. నన్ను పలు రకాలుగా విమర్శించారు.. అసలు మీరెవరు నన్ను అడగడానికి .. శ్రీకాంత్ అయ్యంగర్ అనే వాడు ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే.. అది రాజకీయాలకు సంబంధించింది అవుతుందా? అంటూ ఈ సందర్భంగా మండిపడ్డారు.. అంతేకాదు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రోలర్స్ గురించి కూడా మాట్లాడుతూ.. ట్రోలర్స్ అనేవారు నా దృష్టిలో దానితో సమాధానం అంటూ ఒక జంతువుతో పోల్చి చెప్పారు.

- Advertisement -

ఇకపోతే కెరియర్ పరంగా బాగా సక్సెస్ అయిన శ్రీకాంత్ నిజజీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాని గురించి కూడా మాట్లాడుతూ..నాకు కాస్త తిక్క ఉంది.. అయినా అబద్ధాలు చెప్పడం.. నిజాయితీగా లేకపోవడం లాంటి పనులు నావల్ల కాదు.. అయితే నా భార్యలు తప్పు చేసి నన్నే తప్పుగా చూపించి.. నన్ను వదిలి వెళ్ళిపోవడం మరింత బాధగా అనిపిస్తుంది.. కానీ అప్పటికే భార్యా పిల్లలతో జీవితాన్ని చూసిన నాకు ఇప్పుడు ఒంటరిగా ఉండడం మరింత బాధను కలిగిస్తోంది.. ఫ్యామిలీ మెన్ గా బతకాలని ఎవరికైనా ఉంటుంది..నేనేమీ సైకోను కాదు అలాగే రేపిస్ట్, శాడిస్ట్ ను కూడా కాదు..కానీ వాళ్లే తప్పు చేసి నా జీవితం నుంచి వెళ్ళిపోయారు.. నా మొదటి భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు కూడా నన్ను అర్థం చేసుకోకుండా వారి తల్లి మాటలు విని వెళ్లిపోయారు.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. ఆమె కూడా వేరే వాళ్ల కోసం నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అంటూ బాధపడ్డారు శ్రీకాంత్ అయ్యంగర్..

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు