Suma kankala: గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ అలాంటివి చూపించేవారు- సుమ

బుల్లితెర ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా యాంకరింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న సుమా కనకాల ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఒకవైపు సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరికొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సినిమా ప్రమోషన్స్ కి కూడా తన వంతు చేయూత అందిస్తుంది..తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులను నవ్విస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. స్టార్ మహిళ, క్యాష్, పంచావతారం, సూపర్ సింగర్ ,అవాక్కయ్యారా, జీన్స్, పట్టుకుంటే పట్టు చీర, భలే ఛాన్సులే, లక్కు కిక్కు వంటి ఎన్నో షోలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది సుమ..

ఇకపోతే టాలీవుడ్ అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇంకా చెప్పాలంటే ఈమె డేట్స్ కోసం హీరోలు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. అంతలా క్రేజ్ సంపాదించుకుంది సుమ. ఇక సుమ కెరియర్ విషయాన్ని పక్కన పెడితే.. ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. రాజీవ్ కనకాలను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది .. తాజాగా వీరి దాంపత్య జీవితానికి 25 ఏళ్లు గడిచాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుని పాతికేళ్లు గడిచిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది సుమ.. ఈ వీడియో చూస్తుంటే సుమ కనకాల, రాజీవ్ కనకాల ఇద్దరు అంగరంగ వైభవంగా తమ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకున్నట్లు తెలుస్తోంది.. అలాగే వృద్ధాశ్రమానికి వెళ్లి తమకు తోచిన సహాయం కూడా చేశారు.

ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పారు సుమ మరియు రాజీవ్. అందులో భాగంగానే తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు రాజీవ్ చేసిన పని గురించి తెలిపింది.. ప్రశ్నలలో భాగంగా రాజీవ్ కారణంగా ఏమైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? అని అడగ్గా.. దానికి సుమా మాట్లాడుతూ.. అవును ఉన్నాయి.. నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ బయటకెళ్లేటప్పుడు మళ్లీ ఎప్పుడొస్తావని అడిగేదాన్ని..

- Advertisement -

ఎప్పుడు అడిగినా ఐదు మినిట్స్ లో వచ్చేస్తా అని చెబుతాడు కానీ సమయానికి రాడు అలాగే దెయ్యం సినిమాలు ఎక్కువగా చూపించేవారు.. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్కువగా దెయ్యాల సినిమాలే చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈ విషయం తెలిసిన కొంతమంది రాజీవ్ కనకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చూపించడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సుమ యానివర్సరీ పురస్కరించుకొని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు