Dada Saheb Phalke: అవార్డ్స్ 2023 లిస్ట్

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్ధంగా ఈ అవార్డ్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1969లో ఫాల్కే శత జయంతి సందర్భంగా ఈ అవార్డ్ లను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది.. సినిమా రంగంలో సేవలు చేసిన వారికి ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ల ప్రధానోత్సవం సోమవారం జరిగింది.

ముంబైలోని తాజ్ ల్యాండ్ ఎండ్ లో సోమవారం రాత్రి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను విజేతలకు ప్రధానం చేశారు. ఈ ఈవెంట్ లో దేశ వ్యాప్తంగా సినిమా రంగానికి చెందిన దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ లను గెలుపొందిన వారి వివరాలను ఇక్కడు చూద్దాం.

ఉత్తమ చిత్రం: ది కాశ్మీర్ ఫైల్స్

- Advertisement -

ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ (చుప్)

ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్రా: పార్ట్ 1)

ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడి)

మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి (కాంతార)

ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్

విమర్శకుల ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేదియా)

ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: ఆర్ఆర్ఆర్

ఉత్తమ గాయకుడు: సచేత్ టాండన్ (మయ్య మైను సాంగ్)

ఉత్తమ మహిళా గాయని: నీతి మోహన్ (మేరీ జాన్ సాంగ్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: పిఎస్ వినోద్ (విక్రమ్ వేద)

అత్యంత విలక్షణ నటుడు: అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్)

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: అనుపమ

టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: జైన్ ఇమామ్ (ఫనా- ఇష్క్ మే మార్జవాన్)

టెలివిజన్ సిరీస్ లో ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాష్ (నాగిని)

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు