Dhanush: సార్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో

గతవారం థియేటర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, హిట్ దిశకు దూసుకెళ్తున్న సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్, రివ్యూలను తెచ్చుకుంది. దీంతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తుంది.

ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 50 కోట్లు సాధించింది. వీకెండ్ ముగిసే సమయానికి సార్ చిత్రం రూ. 51 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అందుకుని లాభాలను తీసుకువస్తుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇలాంటి కథతో ఇప్పటికే సినిమాలు వచ్చినా, సార్ లో సెంటిమెంట్ సన్నివేశాలు, ధనుష్ యాక్టింగ్ అదనంగా ఉండటంతో కలిసొచ్చింది. ఈ సినిమాతో అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో ధనుష్ కు మంచి రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.

ధనుష్ కెరీర్ లో తెలుగులో ఇలాంటి విజయం ఎప్పుడూ దక్కలేదు. అయితే సార్ సినిమాకు హీరోను ముందుగా ధనుష్ ను అనుకోలేదట డైరెక్టర్ వెంకీ అట్లూరి. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఉన్న ఈ సార్ కథను ముందుగా నేచురల్ స్టార్ నానికి వెంకీ అట్లూరి వినిపించారట. నానికి సార్ కథ కూడా బాగా నచ్చిందట. కానీ, నాని చేయాల్సిన సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను చేయలేకపోయాడట. దీంతో సార్ చిత్రం ఫైనల్ గా ధనుష్ వద్దకు వచ్చి చేరింది. కాగా నాని ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో NANI30, శైలేష్ కొలను తో HIT3 చేస్తున్న సంగతి విధితమే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు