Mamata Mohan Das: చనిపోతానేమోనని భయపడ్డా

తెలుగు చిత్ర పరిశ్రమలో మమతా మోహన్ దాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా నటించడంతోపాటు ఇంకా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు తెరకి యమదొంగ సినిమాతో పరిచయమైన మమత.. కింగ్, కేడీ, చింతకాయల రవి వంటి సినిమాలు చేసింది.

దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటూ కేరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి సంవత్సరాల పోరాటం తర్వాత గెలిచింది. ఆరోగ్యం పూర్తిగా కోలుకొని ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న తరుణంలోనే మరో అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి బారిన పడిన ఈమె ఆ సమయంలో ఎలాంటి మానసిక క్షోభని ఎదుర్కొందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

“నేను నా కెరియర్ ని మొదలుపెట్టిన కొంతకాలానికి నాకు కేన్సర్ బయటపడింది. నా పేరెంట్స్, ఫ్రెండ్స్ నాకు చాలా మనో ధైర్యం ఇచ్చారు. లైఫ్ లో ఒక టఫ్ పీరియడ్ ఎలా ఉంటుందనేది చూశాను. నా ట్రీట్మెంట్ కి సంబంధించి ఆ సమయంలో నేను ఇలాంటి పోస్టులు పెట్టలేదు. ఆ పరిస్థితుల్లో కూడా నేను మలయాళ సినిమాలు చేస్తూనే వెళ్లాను. తెలుగులో మాత్రం కేడి సినిమా తర్వాత నాకు మంచి పాత్రలు రాలేదు. నేను ఇంకా క్యాన్సర్ తోనే బాధపడుతున్నానని, సినిమాలు చేయడం లేదనే ప్రచారం జరిగింది.

- Advertisement -

క్యాన్సర్ వచ్చినప్పుడు నా ధైర్యాన్ని నమ్ముకున్నాను. కానీ ఈసారి ఇలా జరగలేదు. మహేష్ మారుతీయం షూటింగ్ సమయంలో ఒంటిపై మచ్చలు గుర్తించాను. అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి. పరీక్షల్లో బోల్లి వ్యాధి అని తేలడంతో ఒంటరిగా ఎంతో కృంగిపోయాను. ఆ సమయంలో చనిపోతానేమోనని భయం కూడా నాకు కలిగింది. నాకు వచ్చిన ఈ సమస్య గురించి అందరితో చెప్పుకోవడంతో నాకు కాస్త ఉపశమనం కలిగింది” అని చెప్పుకొచ్చింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు