Cobra : లోపం తెలుసుకున్నారు

కోలీవుడ్ స్టార్ విక్రమ్ గురించి, నట విశ్వరూపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ అంటేనే అపరిచితుడు గుర్తుకు వస్తుంది. అపరిచితుడులో విక్రమ్ చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ అంతటి నటన తాజాగా కోబ్రా సినిమాతో విక్రమ్ చూపించాడు. డ్యూయల్ రోల్ లో కనిపించిన విక్రమ్, సినిమాలో దాదాపు 10 గెటప్స్ లో కనిపించి మరోసారి తన సత్తాను చాటాడు.

సినిమా మొత్తం కూడా విక్రమ్ కనిపించాడని, వన్ మెన్ షో అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాలో మైనస్ ఏదైనా ఉందా అంటే నిడివి అనే సమాధానం వస్తుంది. కోబ్రా నిడివి 3 గంటల 3 నిమిషాల పాటు ఉంది. దీని వల్ల సినిమా విపరీతంగా సాగదీసినట్టు ఫీలింగ్ వస్తుంది. నిజానికి ప్రేక్షకులు 3 గంటల పాటు థియేటర్ లలో కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. ఇటీవల నేచులర్ స్టార్ నాని నుంచి అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా, థియేటర్ల వద్ద సందడి కనిపించలేదు. దీనికి కారణం కూడా నిడివినే అని చెప్పచ్చు.

ఇదిలా ఉండగా కోబ్రా విషయంలో మేకర్స్ అలర్ట్ అయ్యారు. తమ సినిమాలో ఉన్న లోపాన్ని గుర్తించారు. అనవసరమైన సీన్లను కట్ చేసినట్టు ప్రకటించారు. సినిమాలో మొత్తం 20 నిమిషాల సన్నివేశాలను ట్రిమ్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేక్షకులు, అభిమానులు, మీడియా, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు సూచనల మేరకు తమ సినిమాను 20 నిమిషాల పాటు కట్ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

- Advertisement -

దీంతో కోబ్రా సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దీని వల్ల ప్రేక్షకుడికి బోర్ ఫీల్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దీని వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాగా రీ-ఎడిట్ చేసిన సినిమా థియేటర్ లలో ఈ రోజు సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు