Roshan kanakala: ‘సుమ’ పాపులారిటి కూడా బబుల్ గమ్ ని కాపాడలేదు?

టాలీవుడ్ లో డిసెంబర్ 29న రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయని చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. అవును.. ఈ డిసెంబర్ 29న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా రిలీజ్ అయ్యిందని తెలిసిందే. అలాగే మరో సినిమా కూడా రిలీజ్ అయింది.. ఆ సినిమాయే ‘బబుల్ గమ్’. టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల అలాగే నటుడు రాజీవ్ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు సుమ కనకాల దగ్గరుండి మరీ ప్రమోషన్లు చేయించడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్స్ తో పాటలు లాంచ్ చేయించగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించింది. కానీ ఈ సినిమాకు అవి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. చిత్ర నటీనటుల పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, మూవీ డైరెక్షన్ రొటీన్ అయింది. ఒక మూసధోరణి లో సాగే రొటీన్ స్క్రీన్ ప్లే స్టోరీ ని అందించాడు దర్శకుడు.

ఇక బబుల్ గమ్ సినిమా కలెక్షన్లు కూడా చాలా దారుణంగా వచ్చాయి. అంతకు ముందు సలార్ మూవీ ప్రభావం వల్ల, దీంతో పాటే రిలీజ్ అయిన డెవిల్ మూవీ వల్ల ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక బబుల్ గమ్ ఇప్పటివరకు కేవలం 30 లక్షల వరకు మాత్రమే షేర్ వసూలు చేయగా, గ్రాస్ లెక్క 55 లక్షల వరకు ఉంది. అయితే 2.5 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేయాల్సిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని చెప్పాలి. ఇక బబుల్ గమ్ సినిమా వల్ల రోషన్ కనకాల కన్నా, సుమ కనకాల ఇజ్జత్ మొత్తం పోయిందని చెప్పాలి. ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కన్నా ఓటిటి కి అమ్మేసినా సేఫ్ అయ్యేవారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు