Tollywood Heros: సినీ బ్యాగ్రౌండ్ వుండి ఫెయిల్యూర్ అయిన హీరోలు వీళ్లే..!!

Tollywood Heros: ఏ ఇండస్ట్రీలో నైనా నటీనటుల వారసులు, వారసురాళ్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే.. అయితే అలా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంతమందికి అదృష్టం కలిసి రాలేదు.. మరి కొంతమంది అడపా దడపా సినిమాలతో మెప్పించినా ఆ తర్వాత కాలంలో కొన్ని కారణాల చేత సినిమాలకు దూరమైన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి నటుల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో తరుణ్ లవర్ బాయ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. సినీ బ్యాక్ గ్రౌండ్ వున్నా.. ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు తరుణ్.. మరొక హీరో అల్లు శిరీష్.. అల్లు అర్జున్ సోదరుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అల్లు శిరీష్, అడపా దడపా సినిమాలలో నటించినా ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.. దీంతో అల్లు శిరీష్ ఫేడ్ అవుట్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు ? అనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

మరొక యంగ్ హీరో సందీప్ కిషన్.. సందీప్ కిషన్ ఫ్యామిలీ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ కావడం చేత ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలు అందుకున్నప్పటికీ సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ లో బాగా బిజీగా ఉన్నట్లు సమాచారం..మరొక హీరో నందమూరి నారా రోహిత్.. ఎప్పుడూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించే ఈ హీరో అడపాదడపా సినిమాలలో నటించి కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

- Advertisement -

మరొక హీరో సుమంత్ అశ్విన్ కూడా ఒకరు.. ఒకప్పుడు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ఈ నటుడు ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించి ఫెయిల్యూర్ హీరోగా మిగిలిపోయారు.. సుమంత్ తండ్రి నిర్మాత డైరెక్టర్ కూడా ఆయన కూడా తన కొడుక్కి సక్సెస్ ఇవ్వలేకపోయారు. మరొక హీరో తొట్టెంపూడి వేణు.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత కాలంలో పూర్తిగా మారిపోయారు.. ఈమధ్య వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చినా, అది కూడా కెరీర్‌కు పెద్దగా యూజ్ అవ్వలేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు