Bhola Shankar : తమన్నా పాత్రకు కత్తెర ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ సినిమాకు ఇది రీమేక్. ఒరిజినల్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. కథ ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ కంటే హీరో చెల్లెలు పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఒరిజినల్ లో చెల్లెలి పాత్రను లక్ష్మీ మీనన్ చేసింది. తెలుగులో అయితే ఈ పాత్రకు ఏకంగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు.

అందు వల్ల హీరోయిన్ పాత్రకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కథ ప్రకారం చెల్లెలి పాత్ర హీరో పాత్రతో సమానంగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ తమన్నా పాత్రను తగ్గించే పని పెట్టుకుందట చిత్ర బృందం. ముందుగా ఈ చిత్రం కోసం తమన్నాను అడిగిన కాల్ షీట్లు ఎక్కువ అడిగారట దర్శకనిర్మాతలు. అయితే ఇప్పుడు తగ్గించేశారు అని తెలుస్తుంది.

ఇందుకు మరో కారణం కూడా ఉండొచ్చు అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేదు. ‘ఎఫ్3’ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అ క్రెడిట్ కూడా తమన్నా ఖాతాలో పడలేదు. దీంతో తమన్నా పాత్ర నిడివి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు