సూపర్ స్టార్ మహేష్ బాబు, చూడటానికి క్యూట్ గా కనిపించే ఈ యంగ్ కి హీరోకి భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ ఇంటెన్స్ తో డైలాగ్ చెప్తే చాలు ఆడియన్స్ కి పూనకాలు వస్తాయి. మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయ్. కానీ రీసెంట్ గా వచ్చిన సినిమాలు పెద్ద హిట్ అయినా మహేష్ అభిమానులకి మాత్రం ఎక్కడో చిన్న అసంతృప్తిని మిగిల్చాయి.
మహేష్ లోని ఎనర్జీ , ఆ టైమింగ్ ను బాగా మిస్ అయ్యారు అభిమానులు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్ గా మూవీ ను ప్లాన్ చేసుకున్నాడు పరశురామ్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అభిమానులు ఇష్టపడే అంశాలను జోడించి ఒక మాస్ ట్రీట్ ను అందించాడు. మాములుగా మహేష్ బాబు సినిమాల్లో డాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది.
కానీ “సర్కారు వారి పాట” నుంచి రిలీజ్ చేసిన “మ మ మహేషా” సాంగ్ ప్రోమో చూస్తుంటే, మహేష్ అదిరిపోయే స్టెప్స్ వేసాడు అనిపిస్తుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అంచనాలు పెంచుతూనే ఉంది. ఈ పాజిటివ్ వైబ్స్ అన్ని చూస్తుంటే బాక్స్ కి బాబు బ్యాండ్ వెయ్యడం ఖాయం అనిపిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరగనుంది.