నేను రెడీ.. గురూజీయే లేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ రోజు సాయంత్రం యూసఫ్ గూడ పోలీస్ స్టేషన్ లో ప్రీ – రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. చీఫ్ గెస్ట్ గా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ లేఖ రాశాడు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని కోరాడు. అలాగే మహేష్-త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28 మూవీ షూటింగ్ జూన్ లోనే స్టార్ట్ అవుతుందని ప్రకటించాడు. హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు నిర్మిస్తున్నట్టు తెలిపాడు.

- Advertisement -

కాగ ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సింది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల ఆలస్యం అయిందని ఇండస్ట్రీ టాక్. ఆయన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను భుజాలపై వేసుకుని.. నడిపించారు. అలాగే వినోదయ సీతం తెలుగు రీమేక్ కు కూడా డైలాగ్స్ రాస్తున్నాడని సమాచారం. అందుకే మహేష్ 28 మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిందట.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎట్టకేలకు మహేష్ 28 షూటింగ్ ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో జూన్ నుంచే ఈ మూవీ చిత్రీకరణ స్టార్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు