హమ్మయ్య.. పెళ్లి పీటలు ఎక్కుతుంది..!

నయనతార.. తెలుగు, తమిళం, కన్నడ భాషాలో అంటే తెలియని వారు ఉండరు. ఈ మూడు భాషాల్లో స్టార్ హీరోలు అందరితోనూ స్టెప్స్ వేసిన నయన్.. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో పాటు మంచి ఫ్యాన్ బేస్ ను కూడా దక్కించుకుంది. ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్నా.. ఒక తీరని లోటు మాత్రం నయన్ వేంటాడుతుంది. అదే.. పెళ్లి.

ఈ లేడీ సూపర్ స్టార్.. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివాన్ తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మూడేళ్ల పాటు చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ లవ్ బర్ట్స్ పెళ్లి ఎప్పడు అంటే.. మాత్రం దాటవేస్తూ వస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ భగ్న ప్రేమికుల్ని పెళ్లి గురించి అడగటం కూడా మానేశారు. కానీ ఎట్టకేలకు నయనతార తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతుందట. అతి త్వరలోనే విఘ్నేష్ శివాన్ తో కలిసి పెళ్లి పీటలు ఎక్కడానికి ముహుర్తం కూడా ఖరారు చేసిందట. వచ్చే నెలలోనే ఈ లవ్ బర్డ్స్ ఒక్కటి అవుతున్నారట. అందు కోసం నయన్.. పెళ్లి వేదికను కూడా ఫిక్స్ చేయడానికి తిరుపతి దేవస్థానికి వెళ్లింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు