టైగర్ కాంబినేషన్

ప్రస్థానం సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సందీప్ కిషన్
ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ కెరియర్ లో మంచి బిజీగా ఉన్నాడు. తెలుగు సినిమా ఎల్లలు దాటుతున్న ఈ తరుణంలో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ అంతా తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. సందీప్ కూడా ప్రస్తుతం మైఖేల్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.

ఈ సినిమానే కాకుండా తన పుట్టినరోజు సందర్బంగా మరో క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే జరుగుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది మూవీ యూనిట్ .

ఈ సినిమాకు ‘ఊరుపేరు భైరవకోన’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు.
ఇక ఈ సినిమాలో కావ్య థాపర్, వర్షా బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అనిల్ సుంకర్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇదివరకే సందీప్ కిషన్ , రాహుల్ రవీంద్రన్ లు హీరోలుగా టైగర్ అనే సినిమాను చేసారు వి.ఐ ఆనంద్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు