తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు సందడి ముగిసింది. ప్రస్తుతం చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. మే 6వ తేదీన విశ్వక్ సేన్.. అశోక వనంలో అర్జున కళ్యాణం, బుల్లితెర యాంకర్ సుమ కనకాల.. జయమ్మ పంచాయితీ, శ్రీ విష్ణు.. భళా తందనాన తో పాటు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన మా ఇష్టం కూడా రిలీజ్ అయింది.
వీటిలో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం తో పాటు యాంకర్ సుమ కనకాల జయమ్మ పంచాయితీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. భళా తందనాన ఈ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోయింది. అలాగే వర్మ మా ఇష్టం సినిమాకు అయితే.. థియేటర్లే లేక పోవడంతో అసలు రిలీజ్ అయినట్టు కూడా తెలియదు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలపై మరో దెబ్బ పడింది. అదే.. డాక్టర్ స్ట్రేంజ్. నిన్న రిలీజ్ అయిన ఈ మార్వెల్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసకెళ్తుంది. ఓటీటీల పుణ్యామా.. అని మార్వెల్ సినిమాలకు ఫ్యాన్స్ అయిన తెలుగు ఆడియన్స్.. డాక్టర్ స్ట్రేంజ్ కోసం థియేటర్స్ కు క్యూ కడుతున్నారు.
ఈ మూవీలో యాక్షన్ సీన్స్, ఫాంటసీ ఎలివేషన్స్.. సినీ లవర్స్ ను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లెలా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న తెలుగు సినిమాలపై డాక్టర్ స్ట్రేంజ్ ప్రభావం కాస్త గట్టిగానే పడింది. అశోక వనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ కలెక్షన్లు అంచనాలకు తగ్గట్టు రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలపై హాలీవుడ్ మూవీ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.