Anupama: స్ట్రాంగ్ కంబ్యాక్

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ, ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ తరువాత ‘శతమానం భవతి’.. ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ లాంటి సూపర్ హిట్లు ఆమె లిస్టులో ఉన్నాయి. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు తరువాత ఊహించని ప్లాప్స్ పడ్డాయి అనుపమ కెరియర్ లో యంగ్ హీరోస్ తో చేసిన కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే సినిమాలన్ని ప్లాప్ టాక్ తెచ్చుకున్నవే.

ఆ తరువాత ‘రాక్షసుడు’ విజయం సాధించడంతో కొంత రిలీఫ్ దక్కింది.
కానీ క్రేజీ ఆఫర్లు మాత్రం రాలేదు, అంటే సుందరానికి సినిమాలో ఆమె రోల్ అంతంత మాత్రమే. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ2 సినిమాతో మంచి అందుకుంది అనుపమ కానీ ఆ హిట్ క్రెడిట్ అంతా శ్రీ కృష్ణ పరమాత్ముడికి, దర్శకుడు చందు మొండేటికి , హీరో నిఖిల్ కి వెళ్ళిపోయింది. ఆ సక్సెస్ లో అనుపమ భాగమైన ఆ సక్సెస్ ను తాను పర్సనల్ గా అంతగా ఆస్వాదించలేకపోయింది.

రీసెంట్ 18 పేజిస్ సినిమాతో అనుపమ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. సుకుమార్ రాసిన కథ, సూర్యప్రతాప్ పల్నాటి డిజైన్ చేసిన నందిని కేరక్టరైజేషన్ అనుపమ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ను తన నటనతో కట్టి పడేసింది అనుపమ. నందిన లాంటి అమ్మాయి మన లైఫ్ లో కూడా ఉంటే బావుంటుంది అనే ఫీల్ ను క్రియేట్ చేసింది ఆ సినిమాలో అనుపమ పెర్ఫార్మన్స్. సినిమా హిట్ లేక అవకాశాలు చేజారిపోతున్నాయి అనుకున్న తరుణంలో అనుపమ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం అనుపమ అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు