Ante Sundaraniki : అనుకుందోటి.. అయిందోటి..

నేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ, టాలీవుడ్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేస్తున్నాడు. గతేడాది డిఫరేంట్ జోనర్ లో వచ్చిన “శ్యామ్ సింగరాయ్” మూవీ నాని కెరీర్ కు ఎంత బూస్ట్ ఇచ్చిందో అందరికీ తెలుసు. ఈ ఏడాది కూడా విభిన్నమైన కథతో “అంటే సుందరానికి” అనే సినిమా చేస్తున్నాడు. వివేక ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే నెల 10న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే అంటే సుందరానికి మూవీ నుండి.. “పంచె కట్టు సాంగ్, ఎంత చిత్రం…” లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజా గా సోమవారం మరో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ” అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగ “ అంటూ సాగే థర్డ్ సింగిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మూవీ యూనిట్.

కారుణ్య ఈ పాటను ఆలపించగా, వివేక్ సాగర్ మ్యూజిక్ ను అందించాడు. హీరో ఓ సందర్భంలో పడుతున్న ఇబ్బందిని ఈ పాటతో కామెడీని పండించారు. ఈ పాటలో ప్రతి పదం కామెడీని జనరేట్ చేసేట్టు ఉన్నాయి. కాగ ఇప్పటికే “ఎంత చిత్రం ఎన్నెసి జ్ఞపకలో ఊపిరాడేదెలా..” సాంగ్ మంచి మార్కులు కొట్టేయగా, ఇప్పుడు ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చే అవకాశముంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు