రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ శేఖర్ మే 20 న విడుదలై ఓ మాదిరి టాక్ ను రాబట్టుకుంది. మలయాళం సూపర్ హిట్ మూవీ జోసెఫ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించారు.
అయితే విడుదలైన 2 రోజుల తర్వాత ఫైనాన్షియర్ పరంధామరెడ్డి జీవిత రాజశేఖర్ లు తనకు డబ్బు ఇవ్వాలి అంటూ కోర్టులో కేసు వేశారు.
ఈ క్రమంలో 3 వ రోజు నుండీ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు స్టే విధించిందని ఆదివారం రోజు నుండీ ఈ మూవీ ప్రదర్శనను ఆపేశారు. అయితే ఈ కేసులో జీవితా రాజశేఖర్, శేఖర్ టీమ్ కు అనుకూలంగా తీర్పు లభించింది.
‘ ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ మేము తీర్పు ఇవ్వలేదు అంటూ న్యాయస్థానం ఈ మూవీ పై స్పందించింది. కొంతమంది పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించుకోవచ్చు.’ అంటూ న్యాయస్థానం శేఖర్ టీమ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.