Anil Ravipudi : #NBK 108 షూరు

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 108 సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం అయింది. ఉదయం 9:36 గంటలకి ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ ని ప్రారంభించింది మూవీ యూనిట్. హైదరాబాద్ లో ఓ జైలు సెట్ లోనే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ని ముగించనుంది మూవీ యూనిట్.

రవితేజ కిలాడి సినిమా షూటింగ్ కోసం వేసిన ఈ జైల్ సెట్ ని కొంత ఎక్స్టెండ్ చేసి ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఓ సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల నటిస్తుండగా, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతుంది. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. అఖండ ఫేమ్ రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అంటున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు