Amala : రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్

కోలీవుడ్ లో 1980-90 లలో అగ్ర హీరోయిన్ గా ఉన్న వాళ్లల్లో అక్కినేని అమలు ఒకరు. 1986 లో “మైథిలి ఎన్నై కథలి” అనే సినిమాతో అమల తొలిసారి వెండితెర పై హీరోయిన్ గా నటించింది. తొలి సినిమా కే సైమా అవార్డుకు నామినేట్ అయింది. దీని తర్వాత ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు సినిమాలు చేస్తూ కోలీవుడ్ లోనే ఫుల్ బిజీ నటిగా ఎదిగింది. 1991 వరకు కూడా కోలీవుడ్ లో అమల స్టార్ హీరోయిన్ గానే ఉంది. అయితే 1992లో అక్కినేని నాగర్జునతో వివాహం తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. మధ్యలో ఒక సారి “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” సినిమాలో తల్లి పాత్రలో కనిపించింది. మళ్లీ తాజాగా మరోసారి అక్కినేని అమల సిల్వర్ స్క్రిన్ పై కనిపించింది.

కొత్త డైరెక్టర్ శ్రీ కార్తిక్ దర్శకత్వంలో, శర్వానంద్ హీరోగా “ఒకే ఒక జీవితం” సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోకు తల్లి పాత్రలో అక్కినేని అమల నటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే అమల పాత్రకు కూడా సినీ విశ్లేషకులు మంచి మార్కులు వేస్తున్నారు. చాలా రోజుల తర్వాత అమల రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉందని, పెద్ద సక్సెస్ అయిందంటూ చెబుతున్నారు.

దీంతో ఇండస్ట్రీలో వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. ఇక తల్లి పాత్రలకు అక్కినేని అమల నెంబర్ వన్ ఛాయిస్ ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ క్రిటిక్స్ జోస్యం చెబుతున్నారు. ఇప్పడు ఉన్న వారిలో అమలనే దర్శక నిర్మాతలకు బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. నిజానికి ఒకే ఒక జీవితం సినిమాలో అమల నటన చూస్తే అది జరుగుతుందని గట్టిగానే చెప్పవచ్చు. తల్లీ కుమారుల మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాల్లో అమల పలికిన హవా భావాలు ప్రేక్షకుల నుంచి కన్నీరు పెట్టించాయి.

- Advertisement -

దీంతో అమ్మ పాత్రలకు పక్కా ప్రత్యామ్నాయం అమలనే అవుతుందని చెప్పొచ్చు. మరి అమల తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయబోతుంది ? ఎలాంటి పాత్రలను చేస్తుంది ? అసలు రీ ఎంట్రీని కొనసాగిస్తుందా ? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి త్వరలోనే సమాధానాలు వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు