Alluri: ట్రైలర్ రిలీజ్

ప్రయోగాత్మక సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు శ్రీ విష్ణు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. గతేడాది ” గాలి సంపత్”, ” రాజరాజ చోర”, ” అర్జున ఫల్గుణ” “భళా తందనాన” చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈయన తాజాగా నటించిన చిత్రం ” అల్లూరి”. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా.. లక్కీ మీడియా బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని హీరో నాని విడుదల చేశారు.

“లక్ష్యం పెట్టుకోవడం, దాన్ని సాధించడం గొప్ప కాదు. లక్ష్యసాధన కోసం చేసే పోరాటం అద్భుతం” అని తనికెళ్ళ భరణి.. హీరోలో స్ఫూర్తిని నింపే సంభాషణతో ప్రారంభమైన ఈ ట్రైలర్ అధ్యంతం అలరించింది. పోలీస్ పవర్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్ లో చూపించారు. నిజాయితీగా ఉండే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. వాటిని అతడు ఎలా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ తో ఈ సినిమా కధ సాగనుంది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. ఖయాద్ లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన్ రావు, రాజా రవీంద్ర, పృధ్విరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ హాజరుకానున్నారు. మరి శ్రీ విష్ణు చేసిన ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు