Krithi Shetty : ట్విట్ట‌ర్‌లో ముచ్చ‌ట్లు

టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి ఉప్పెన చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం విధిత‌మే. త‌న తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఇక అప్ప‌టి నుంచి ఒక్కసారిగా ఈమె క్రేజ్ మారిపోయింది. వ‌రుస సినిమా ఆఫ‌ర్లు త‌లుపు త‌ట్టాయి. చేతి నిండా చిత్రాల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. వ‌రుస‌గా సూప‌ర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.

కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళంలో కూడా ప‌లు ప్రాజెక్ట్‌ల‌ను చేస్తుంది ఈ అమ్ముడు. తెలుగులో ఉప్పెన‌, శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు, ది వారియ‌ర్, చిత్రాల‌తో పాటు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది. ఈ చిత్రం ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఆమె ట్విట్ట‌ర్ లో ముచ్చ‌టించింది. అందులో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌హ‌నంగా స‌మాధానం చెప్పింది. ఈ త‌రుణంలోనే ప‌లువురు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

త‌మిళంతో అజిత్‌, విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌శ్నించ‌గా.. అజిత్ జెన్యూన్ ప‌ర్స‌న్ అని, విజ‌య్ ఇన్స్‌ఫైరింగ్ సూప‌ర్ స్టార్ అని పేర్కొంది. అదేవిధంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్‌లో మాత్ర‌మే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా సూప‌ర్ స్టార్ చెప్పుకొచ్చింది. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న ఫేవ‌రేట్ హీరో అని చెప్పింది.  మంచి స్టోరీ వ‌స్తే క‌న్న‌డ‌లో చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ గురించి ప్ర‌శ్నించ‌గా..? డౌన్ టూ ఎర్త్ సూప‌ర్ స్టార్ అని పేర్కొన‌డం విశేషం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు