Allari Naresh : అల్లరి నరేష్ లో ఊహించని మార్పు… ఇకపై అలాంటి కథల జోలికి వెళ్ళడా?

యంగ్ హీరో అల్లరి నరేష్ ఎట్టకేలకు ట్రాక్ మార్చినట్టుగా అనిపిస్తోంది. ఇప్పటిదాకా రొటీన్ రొట్ట కొట్టుడు కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించిన ఈ అల్లరోడు మొత్తానికి లైన్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన “ఆ ఒక్కటీ అడక్కు” టీజర్ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా అల్లరి నరేష్ కెరీర్ గాడిన పడ్డట్టేనా? అంటే…

అల్లరి నరేష్ కెరీర్ లో చేసిన తప్పు అదే…
2002లో అల్లరి మూవీతో ఇవివి సత్యనారాయణ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం వేళ్ళ మీదే లెక్క పెట్టొచ్చు. ముఖ్యంగా హిట్ సినిమాల సంఖ్య అల్లరి నరేష్ కెరీర్ లో చాలా తక్కువ. కితకితలు, సీమశాస్త్రి వంటి హిలేరియస్ సినిమాల్లో అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఆయన చేసే ప్రతి సినిమాల అలాగే ఉండడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. ముఖ్యంగా అవే పాత చింతకాయ పచ్చడి కథలు, కామెడీ, పంచ్ లు ఆడియన్స్ కి నచ్చలేదు. ఫలితంగా అల్లరి నరేష్ ను మెల్లమెల్లగా రిజెక్ట్ చేస్తూ వచ్చారు ఆడియన్స్. దీంతో ఆలోచనలో పడ్డ ఈ అల్లరోడు “నాంది” అనే మూవీతో యాక్షన్ జానర్ లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యాడు. నాంది మూవీలో అల్లరి నరేష్ నటనను చూశాక ఇంతటి టాలెంట్ ఉండి అలాంటి కామెడీ సినిమాలు చేయడం ఏంటి? అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ హీరో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చినట్టే అనుకున్నారు అంతా. కానీ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ తలకిందులు చేస్తూ నాంది తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఆ ఒక్కటి అడక్కు మూవీతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే ఈసారి కూడా కామెడీ జానర్ నే ఎంచుకున్నాడు అల్లరి నరేష్. కానీ అందులో కొత్తదనం ఉంది. ప్రేక్షకులకు కావాల్సింది కూడా అదే.

ఎట్టకేలకు రూటు మార్చిన అల్లరోడు…
ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న హిలేరియస్ కామెడీ మూవీ “ఆ ఒక్కటి అడక్కు”. ఈ మూవీలో అల్లరి నరేష్ కు జోడిగా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, మల్లి అంకం దర్శకత్వం వహించారు. రాజీవ్ చిలక ఈ మూవీని నిర్మించారు. వేసవిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మార్చ్ 22న థియేటర్లలోకి రాబోతోంది ఆ ఒక్కటి అడక్కు. అయితే ఈ మూవీలో అల్లరి నరేష్ కామెడీని ప్రజెంట్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ పేరడీ, స్పూఫ్ సన్నివేశాలు ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చడం లేదు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగులు, ఫ్యాట్ షేమింగ్ అనేవి కూడా అవుట్ డేటెడ్ అయిపోయాయి. కథలో కామెడీ ఉండాలి, దాంతో పాటు కొత్తదనం కూడా అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో అల్లరి నరేష్ సక్సెస్ ఫుల్ అయినట్టున్నాడు. ప్రేక్షకులు కొత్తదనంతో కూడిన ఆహ్లాదకరమైన సినిమాలకు ఇష్టపడుతున్నారనే విషయం ఆయనకు అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. మరి ఈ సినిమాతోనైనా అల్లరి నరేష్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదంటే ప్రేక్షకులు ఆ ఒక్కటి అడక్కు అంటూ ఆయనకు సక్సెస్ ఇవ్వడానికి మొహాలు చాటేస్తారా అనేది తెలియాలంటే మార్చి 22 వరకు వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు