Nelson : సీక్వెల్ రెడీ చేస్తాడా.? కొత్త స్క్రిప్ట్ చేస్తాడా.?

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొలమావు కోకిల సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. అయితే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో యోగి బాబుని చూపించిన విధానం. నయనతార ను చూపించిన విధానం. ఆ కథ, స్క్రీన్ ప్లే, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఇవన్నీ కూడా అప్పటి ప్రేక్షకులకి మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. ఇదే సినిమాను తెలుగులో కూడా కోకో కోకిల అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది.

ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన సినిమా వరుణ్ డాక్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన విజయాన్ని సాధించింది. అసలు కామెడీని ఇలా కూడా చేయొచ్చు. అని తన పంథాలో కామెడీని చూపించి ఆ సినిమాను దాదాపు 100 కోట్లు మార్కు అందుకునేలా హిట్ చేశాడు నెల్సన్. అప్పటితో నెల్సన్ పైన అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.ఇదే సినిమా తెలుగులో కూడా బీభత్సమైన విజయాన్ని సాధించింది.

నెల్సన్ చేసిన 3వ సినిమా బీస్ట్. అప్పటికే వరుణ్ డాక్టర్ అనే సినిమా మంచి హిట్ అవ్వటం. ఇళయ దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోతో నెల్సన్ సినిమా చేస్తుండడంతో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా బీస్ట్ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అక్కడితో నెల్సన్ పని అయిపోయింది అనుకున్నరంతా.

- Advertisement -

కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్ అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. నెల్సన్ జైలర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. అయితే జైలర్ లో రజనీకాంత్ ను నెల్సన్ చూపించిన విధానం. ఆ స్టైల్ ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

అయితే జైలర్ సినిమాకి సీక్వెల్ గా సినిమాను చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించాడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంత పెద్ద హిట్ సినిమాకి సీక్వెల్ గా మరో సినిమాను తీయాలంటే కథ కూడా దానిని మించి ఉండాలని అందరికీ తెలిసిందే. జైలర్ సినిమా హిట్ అయింది కాబట్టి పై ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉంటాయి. వాటిని అందుకోవాలంటే పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి.

ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ రాయడమే కాకుండా నెల్సన్ దర్శకుడిగా పరిచయమైన కొలమావు కోకిల సినిమాకి సీక్వెల్ రాయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే నెల్సన్ ఇప్పుడు కొలమావుకోకిల సినిమాకి సీక్వెల్ రాస్తాడా.? లేదంటే వేరే హీరోతో ఒక కొత్త కథను రాస్తాడా.? అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు