Matka : మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్న వరుణ్ తేజ్

ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. అయితే మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని, ఇండస్ట్రీకి మరో యంగ్ టాలెంట్ దొరికింది అనేలా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల డీల్ చేసిన విధానం. వరుణ్ తేజ్ నుంచి పర్ఫామెన్స్ ను రాబట్టిన విధానం. విలేజ్ పాలిటిక్స్ ని చూపించిన విధానం. ఇవన్నీ కూడా ఈ సినిమాని ఒక సూపర్ హిట్ దిశగా మలిచాయి అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే పూజ హెగ్డే హీరోయిన్ గా పరిచయం అయింది.

ముకుంద సినిమా తర్వాత వరుణ్ తేజ్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్లు సాధించాయి. అయితే అందరి హీరోల్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ మంచి సబ్జెక్టులను చేస్తూ ముందుకు వెళ్లడం వరుణ్ తేజ్ లో ఉన్న ప్రత్యేకత అని చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు వరుణ్ తేజ్ చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఒక హీరోగా మాత్రం వరుణ్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని మాత్రం చెప్పొచ్చు.

ఇకపోతే రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు వరుణ్. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ పాలు అయింది. వరుణ్ చేసిన గద్దల కొండ గణేష్ వంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ సాధించింది. అయితే వరుణ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేసిన ప్రతిసారి కూడా మార్కెట్ తగ్గుతూ వస్తుంది.

- Advertisement -

దీనిపై వరుణ్ తేజ్ కూడా స్పందిస్తూ నేను ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ దాని వలన నా మార్కెట్ తగ్గినా కూడా నేను రెమ్యూనరేషన్ తీసుకోవడం మానేస్తాను అన్నట్లు చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి వరుణ్ కి యాక్టింగ్ పైన ఎంత ప్యాషన్ ఉంది అని ఈ స్టేట్మెంట్ తో చాలామందికి అర్థం అయింది. ఇకపోతే సినిమా అంటే వ్యాపారం అని కూడా ఆలోచించేవాళ్ళు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే వరుణ్ తేజ్ ఇప్పుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాని చేస్తున్నాడు. పలాస సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కరుణ్ కుమార్. మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలను పొందుకున్నాడు. ఆ సినిమా థియేటర్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని పేరును మాత్రం సంపాదించాడు.

పలాస సినిమా తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ ఒక సినిమాను చేశాడు కరుణ్ కుమార్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు కరుణ్ కుమార్ చేస్తున్న సినిమా మట్కా. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో దాదాపు మూడు గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీంట్లో 50 ఏళ్లు ఉన్న వ్యక్తిగా కనిపించడం అనేది ఆసక్తికర విషయం అని చెప్పొచ్చు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు