Dheera : అఖిల్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ 100 కోట్లు అంట !

అఖిల్ అక్కినేని హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా గత కొద్దీ రోజుల క్రితం రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి రిలీజైన మొదటి రోజు నుంచే ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా తగ్గాయి.

ఏజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో అనిల్ సుంకర ఈ విషయంపై స్పందిస్తూ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేయడం వల్ల సినిమా ప్రేక్షకులని అలరించలేకపోయిందంటూ ట్విట్టర్ లో స్పందించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఏజెంట్ సినిమా ప్లాప్ ప్రభావం అందరి కన్నా ఎక్కువగా అఖిల్ పైనే పడింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ అహోరాత్రులు కష్టపడ్డాడు. సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో అఖిల్ సురేందర్ రెడ్డి ఏది చేయమంటే అదే చేసాడు. కానీ సినిమా ప్లాప్ అవడంతో అఖిల్ ఢీలా పడిపోయాడు.

అయితే అఖిల్ స్టార్ డైరెక్టర్ లని నమ్ముకొని ప్రతిసారి మోసపోతూ వస్తున్న తరుణంలో ఈసారి అఖిల్ ఒక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. రాధే శ్యామ్, సాహూ సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తో అఖిల్ కోలాబిరేట్ అవ్వబోతున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాని భారీ స్కెల్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారంట. ధీర అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నరని టాక్. అయితే ఆన్ బోర్డు ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లు అంట. ఇప్పటికే ఏజెంట్ సినిమాకి 80 కోట్ల వరకి పెట్టి మినిమమ్ వసూళ్లు కూడా రాకపోయిన మళ్ళీ అఖిల్ ని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టడం ఆశ్చర్య పోవాల్సిన విషయమనే చెప్పాలి.మరి అఖిల్ ని నమ్మి ఇంత పెట్టుబడి పెడుతున్న యూవీకి అఖిల్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు